గతంలో అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరించిన అధికారులు, ఇప్పుడు స్టెమ్ ఓపీటీ పొడిగింపులో ఉన్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఆకస్మిక తనిఖీలు చట్టబద్ధమే అయినప్పటికీ, గతంలో ఎన్నడూ లేనంతగా వీటిని ముమ్మరం చేయడంతో ఆందోళన చెందుతున్నారు. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ కింద పనిచేసే ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ నేషనల్ సెక్యూరిటీ విభాగం ఈ తనిఖీలను నిర్వహిస్తోంది. ఓపెన్డోర్స్ రిపోర్ట్ 2023-24 ప్రకారం, అమెరికాలో సుమారు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా, వారిలో 97,556 మంది ఓపీటీ ప్రోగ్రామ్లో ఉన్నారు. స్టెమ్ విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యాక మొత్తం మూడేళ్ల పాటు పనిచేసే అవకాశం ఓపీటీ ద్వారా లభిస్తుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు తమ ‘ఫామ్-ఐ983’లో పేర్కొన్న నిబంధనల ప్రకారమే సంబంధిత రంగంలో శిక్షణ పొందుతున్నారా? వారి ఎఫ్-1 వీసా స్టేటస్ చెల్లుబాటులో ఉందా, లేదా? అనే విషయాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల స్టెమ్ ఓపీటీలో ఉన్న ఒక విద్యార్థి ఏం చెప్పారంటే.. అధికారులు అకస్మాత్తుగా తన నివాసానికి వచ్చి పత్రాలు పరిశీలించారని, మరిన్ని ఆధారాలు చూపాలని కోరారని తెలిపారు. ఫ్లోరిడాకు చెందిన ఒక ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఏం చెప్పారంటే.. “ట్రంప్ ప్రభుత్వం ఈ తనిఖీలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు తమ పత్రాలన్నింటినీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అధికారులు వచ్చినప్పుడు కంగారు పడకుండా, ప్రశాంతంగా ఉండి వారు అడిగిన ప్రశ్నలకు నిజాయతీగా సమాధానాలు ఇవ్వాలి” అని సూచించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ రైల్వేలో 8,875 ఉద్యోగాలకు నోటిఫికేషన్
సినీ రంగంలోకి హీరో సూర్య కూతురు!
ఐటీ ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..
పురానాపూల్లో నీటమునిగిన శివాలయం.. వరదలో చిక్కుకున్న పూజారి కుటుంబం
సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమాల క్యూ