బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాయి. మొదటి వారం హౌస్ నుంచి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది. అలాగే రెండో వారం మర్యాద మనీష్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఇప్పుడు మూడోవారం హౌస్ నుంచి ఎవరు బయట వస్తారా అని ప్రేక్షకులు ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ వారం ఆ నామినేషన్స్ గరం గరంగా జరిగాయి. మూడో వారంలో హరీష్, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతూ వర్మ, ప్రియా, శ్రీజా నామినేషన్స్ లో ఉన్నారని తెలుస్తుంది. అలాగే సెకండ్ వీక్ కెప్టెన్ గా మారిన డిమాన్ పవన్ కు స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. నామినేషన్స్ లో ఉన్నవారిలో ఒకరిని సేవ్ చెయ్యొచ్చు అని చెప్పాడు. దాంతో పవన్ రీతూని సేవ్ చేస్తాడనుకుంటే..ఊహించని విధంగా శ్రీజాను సేవ్ చేశాడు. దాంతో శ్రీజ జస్ట్ మిస్ అయ్యింది.
చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది
ఇక ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్న వారికి ఓటింగ్ జరుగుతుంది. మొదటి వారం నుంచి బిగ్ బాస్ హౌస్ లో ప్రియా శెట్టి, శ్రీజ పై ఆడియన్స్ కాస్త గుర్రుగానే ఉన్నారు. హౌస్ లో వీరి ప్రవర్తన.. చేసే పంచాయితీలు చూసి ప్రేక్షకులకు చిరాకు వచ్చింది. ఎప్పుడెప్పుడు ప్రియా, శ్రీజ నామినేషన్స్ లో ఉంటారా ఎలిమినేట్ చేసి బయటకు పంపించేద్దామా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ వారం నామినేషన్స్ నుంచి శ్రీజ తప్పించుకోవడంతో ఇప్పుడు ప్రియా ఎలిమినేట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు
ఇప్పటికే ఓటింగ్ లో ప్రియా లీస్ట్ లో ఉంది. ఫ్లోరా షైనీ ప్రస్తుతం ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతుంది. లక్స్ పాపకు ప్రేక్షకులు ఓట్లు గట్టిగానే గుద్దుతున్నారు. ఫ్లోరా తర్వాత రాము రాథోడ్ ఓటింగ్ లో దూసుకుపోతున్నాడు. ఆతర్వాత హరిత హరీష్, కళ్యాణ్, రీతూ చౌదరి నామినేషన్స్ లో ఉన్నారు. వీరందరి కంటే చివరిలో ఉంది ప్రియ శెట్టి. శుక్రవారం వరకు సమయం ఉండటంతో మరి ప్రియా గట్టెక్కుతుందో లేదో చూడాలి. కానీ ప్రియ ఈవారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది.
ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.