కానీ తిరిగి చెల్లించకుంగానే మరణించాడు. ఇది తెలుసుకున్న అతని స్నేహితుడు. ఆగ్రహానికి లోనయ్యాడు. గ్రామంలోని శ్మశానవాటికలో అతని అంత్యక్రియలు జరుగుతున్నాయని తెలుసుకొని వెంటనే అక్కడికి చేరుకున్నాడు. అక్కడ తన స్నేహితుడి చితి కాలిపోతుండడం చూశాడు.. పక్కనే మృతుడి భార్య, పిల్లలు చితికి దగ్గరగా నిలబడి ఉండడం కనిపించింది. అక్కడే ఓ కర్రను చేతికి అందుకున్న ఆ వ్యక్తి వెంటనే చితి దగ్గరకు వెళ్లి మండుతున్న చితిని కొట్టడం ప్రారంభించాడు. దీంతో చితిపై ఉన్న నిప్పురవ్వలు, కట్టెలు ఎగిరి చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ షాకింగ్ ఘటన చూసిన వారు షాకయ్యారు. కాలిపోతున్న తన స్నేహితుడి చితిని కర్రలతో కొట్టి ధ్వంసం చేశాడు. తన స్నేహితుడు 50,000 రూపాయలు అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించకుండానే మరణించాడన్నది తన ఆగ్రహం. అందుకే చితిని కర్రలతో కొట్టి ధ్వంసం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడే ఉన్న ఒక యువకుడు ఈ తతంగాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అతను కర్రతో చితిని కొడుతూ, “అయ్యో, నా డబ్బు తిరిగి ఇవ్వలేదు” అని వాపోవడం వీడియోలో కనిపించింది. వీడియో చూసిన నెటిజన్లు అంత్యక్రియలు ప్రశాంతంగా జరగనీకుండా ఎందుకు అడ్డుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. కోపం ప్రదర్శించడానికి ఇది అనువైన వేదిక కాదని నెట్టింట చర్చ జరుగుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పీఎఫ్ సొమ్ము విత్‌డ్రాపై ఈపీఎఫ్‌వో హెచ్చరిక
రూ.4 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారికి విశేష అలంకరణ
Cheeramenu Fish: పులస వెళ్లింది.. చీరమేను వచ్చింది..
కరివేపాకు కోద్దామని పెరట్లోకి వెళ్లింది..కళ్లు మూసి తెరిచేంతలో ఆమె
అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త టెన్షన్