అస్సాంలో సుఖోయ్-30 యుద్ద విమానం గల్లంతు కావడం సంచలనం రేపింది. రాడార్ కాంటాక్ట్ నుంచి ఫైటర్ జెట్ మిస్సింగ్ అయ్యింది. యుద్ద విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టింది ఎయిర్ఫోర్ప్. అస్సాంలోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌ఫోర్స్ బలగాలు గాలింపు చర్యలు చర్యలు చేపట్టాయి.
భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ యుద్ధ విమానం అదృశ్యమైంది. అస్సాంలోని జోర్హాట్ నుండి సు-30 జెట్ బయలుదేరి, ఆపై కర్బీ అంగ్లాంగ్ జిల్లా మీదుగా రాడార్ నుండి అకస్మాత్తుగా కనిపించకుండాపోయింది. యుద్ధ విమానం రాడార్ సంబంధాన్ని కోల్పోయిందని గౌహతిలోని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రజా సంబంధాల అధికారి తెలిపారు.
భారత వైమానిక దళం సుఖోయ్ 30 విమానం తప్పిపోయినట్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో “భారత వైమానిక దళానికి చెందిన Su-30 MKI విమానం కనిపించకుండా పోయినట్లు సమాచారం. ఆ విమానం అస్సాంలోని జోర్హాట్ నుండి బయలుదేరింది. చివరిగా రాత్రి 7:42 గంటలకు సంప్రదించింది. మరింత సమాచారం కోసం సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది” పేర్కొంది.
రాఫెల్ తర్వాత, Su-30MKI భారత వైమానిక దళంలో అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం. ఇది వైమానిక రక్షణ, బలమైన దాడి, సముద్ర కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రస్తుతం, భారత వైమానిక దళంలో Su-30MKI ఏకైక యుద్ధ విమానం. సుఖోయ్-30 MKI “సూపర్ సుఖోయ్” సూపర్-30 కార్యక్రమం కింద ఆధునీకరించడం జరిగింది. 2040 నాటికి దాని పూర్తి కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తున్నారు. రూ. 63,000 కోట్ల ప్రాజెక్టులో 84 విమానాలను స్వదేశీ AESA రాడార్, కొత్త ఏవియానిక్స్, ఆధునిక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లు, దీర్ఘ-శ్రేణి క్షిపణులు అంటే బ్రహ్మోస్ వంటివి వాటితో సన్నద్ధం చేయడం, వాటి జీవితకాలం 25-30 సంవత్సరాలు పొడిగించడం జరుగుతుందని రక్షణ వర్గాలు తెలిపాయి.
సుఖోయ్ Su-30MKI యుద్ధ విమానాలను 2002లో భారత వైమానిక దళంలో చేర్చారు. భారతదేశం 1996లో సుఖోయ్ కోసం రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. Su-30 విమానాల మొదటి బ్యాచ్ 1997లో భారతదేశానికి డెలివరీ అయ్యింది. అయితే ఆధునీకరించిన Su-30MKIలు 2002లో భారత వైమానిక దళంలో చేరాయి. ఈ యుద్ధ విమానాలను సుఖోయ్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఉమ్మడి ఉత్పత్తి నుండి మొదటి Su-30 నవంబర్ 2004లో వైమానిక దళంలో చేరింది. ప్రస్తుతం, Su-30MKIలు భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి. వీటి సంఖ్య 200 కంటే ఎక్కువే..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..