సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న భూతం పైరసీ.. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం పాపం.. గంటల వ్యవధిలో సినిమాలను పైరసీ చేస్తున్నారు. కాగా దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా రిలీజ్ కాకముందే సర్వర్ లను హ్యాక్ చేసి వీడియో ను గేమింగ్ సైట్ లో అప్లోడ్ చేస్తుంది ఈ ముఠా. ఈ ముఠాలోని కీలక నిందితుడు ఇంటర్మీడియట్ వరకే చదివాడని తెలుస్తుంది. అలాగే నిందితుడికి ప్రాఫిట్ అంతా డాలర్ లోనే ఉందని పోలీసులు తెలిపారు.
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?
సినిమా ఇండస్ట్రీకీ ఇప్పిటి వరకూ 22వేల కోట్లు నష్టం వచ్చినట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటికే రెండు నెలల క్రితం వనస్థలీపురం కి చెందిన కిరణ్ ను అరెస్ట్ పోలీసులు చేశారు. కిరణ్ కస్టడీలో కీలక విషయాలను రాబట్టారు. దుబాయ్, నెదర్లాండ్, మియన్మార్ లో సినిమా పైరసీ కేటుగాళ్ళు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్
కాగా తాజాగా అరెస్ట్ చేసిన నిందితుల దగ్గర OG తో పాటు పలు కొత్త సినిమాలు పైరసీ చేసినట్టు తెలుసుకున్నారు పోలీసులు. హార్డ్ డిస్క్ లు, రికార్డింగ్ సీక్రెట్ కెమెరాలు, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్వర్డ్లను నేరగాళ్లు క్రాక్ చేస్తున్నారు. అలాగే ఓటీటీ సినిమాలను కూడా పలు వెబ్ సైట్లకు అమ్ముతున్నారు నేరగాళ్లు. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫారంలో ఈ వీడియోలను వైరల్ చేస్తున్నారు. పైరసీ ముఠాకు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్ ముఠాలు. తమ బెట్టింగ్ సైట్లను ప్రమోట్ చేసేందుకు పైరేటెడ్ వీడియోలను బెట్టింగ్ ముఠాలు ఉపయోగిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మంచి కొడుకును కాలేకపోయా.. జీవితం అయిపోయిందని బాధపడ్డా.. ఎమోష్నలైన షణ్ముఖ్ జశ్వంత్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..