ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రాబోయే సినిమా గురించి ప్రత్యేక వివరాలు వెలువడ్డాయి. పుష్పరాజ్ సృష్టించిన సంచలనం తర్వాత, తదుపరి చిత్రం అంతకుమించి ఉండాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రలలో నటించనున్నారు. అందులో రెండు యువ పాత్రలు, ఒక పీరియడ్ క్యారెక్టర్, మరియు ఒక వృద్ధ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం కథ 16వ శతాబ్దంలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. పీరియడ్ పాత్ర 16వ శతాబ్దపు నేపథ్యంలో సాగుతుంది. ఆ తర్వాత మూడు ఇతర పాత్రలు పరిచయమవుతాయి. ఐకాన్ స్టార్‌ను అన్ని గెటప్‌లలో ఎలా చూపిస్తారో అని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :