అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్ 19 రోజులు

అక్టోబర్‌లో బ్యాంక్ హాలిడేస్ 19 రోజులు


అందువల్ల కస్టమర్లు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్​ కార్యకలాపాలను ప్లాన్​ చేసుకోవడం మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కచ్చితంగా బ్యాంక్ అకౌంట్లు ఒకటికి మించి ఉంటున్నాయి. ముఖ్యంగా.. వేతన జీవులకు ఉద్యోగం మారే కొద్దీ.. అక్కడ కొత్త అకౌంట్ తీయాల్సి వస్తుంటుంది. వీటిని శాలరీ అకౌంట్స్ అంటారు. ఇంకా.. మనకు ఇక్కడ బ్యాంకుల్లో ఎప్పుడూ ఏదో పని పడుతూనే ఉంటుంది. చెక్ బుక్ కోసం, పాస్ బుక్ సేవల కోసం.. డబ్బులు వేసేందుకు, విత్‌డ్రా చేసేందుకు, లోన్ కోసం అప్లై చేసేందుకు.. హోం లోన్ కోసం, గోల్డ్ లోన్ల కోసం, ప్రభుత్వ పథకాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇలా చాలానే పనులు ఉంటాయి. అందుకోసం.. కొన్ని సార్లు ఆన్‌లైన్ ద్వారా అయినా.. ఇంకొన్ని సార్లు మాత్రం కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సి వస్తుంది. అందుకే.. ఇక్కడ ముఖ్యంగా ఏ రోజు బ్యాంక్ పనిచేస్తుంది.. ఏరోజు హాలిడే ఉందనే దానిపై అవగాహన ఉండాలి. ఉద్యోగ రీత్యా చాలా మందికి పని దినాల్లో సెలవులు దొరకడం కష్టమే. ఇంకా బ్యాంక్ పనుల కోసం సొంతూర్లకు కూడా వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడే ముందుగా షెడ్యూల్ చేస్కొని.. ఆఫీసులో సెలవు తీస్కొని బ్యాంకుకు వెళ్తే.. ఆ రోజు బ్యాంక్ మూసేసి ఉంటే.. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే.. ముందుగానే బ్యాంక్ హాలిడేస్ గురించి మనం తెలుసుకోవాలి. అక్టోబర్ నెలలో చాలానే పండగలు ఉన్నాయి. గాంధీ జయంతి, దసరాతో పాటు దీపావళి పండగలు అక్టోబర్ నెలలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే.. అక్టోబర్ నెలలో అయోధ్య పూజ, విజయదశమి, దుర్గా పూజ, గాంధీ జయంతి, లక్ష్మీ పూజ, మహర్షి వాల్మీకి జయంతి, కర్వా చౌత్, బిహూ, దీపావళి, నరక చతుర్దశి, గోవర్ధన్ పూజ, భాయ్‌దూజ్, చట్ పూజ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి వంటివి ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే బ్యాంక్ సెలవులు దసరా అక్టోబర్ 2- గురువారం, దీపావళి (అక్టోబర్ 20- సోమవారం) సెలవులు ఉన్నాయి. గాంధీ జయంతి రోజునే ఈసారి దసరా వచ్చింది. ఇలా ఒకే రోజు రెండు సెలవులు ఉన్నాయన్నమాట. ఇంకా.. రెండో, నాలుగో శనివారాలు (అక్టోబర్ 11, 25) కూడా బ్యాంకులు పనిచేయవు. ఇలా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 8 రోజులు బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఇక్కడ బ్యాంకులకు హాలిడే ఉన్నప్పటికీ.. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి. ఇంకా.. ఏటీఎంలు కూడా అందుబాటులో ఉంటాయి. కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సిన పనులకు మాత్రమే ఆటంకం కలుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ ఆటో రిక్షా కుర్రాడి సంపాదన నెలకు రూ.లక్ష

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్ఫూర్తిదాయక నిర్ణయం

రన్నరప్ చెక్ ను స్వీకరించి విసిరేసిన పాక్ కెప్టెన్

అమ్మబాబోయ్‌.. ఒకే కిడ్నీలో 1820 రాళ్లు..

టీమిండియా ప్లేయర్లకు BCCI భారీ నజరానా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *