‘అందరూ ఉన్నా ఎవరూ లేనట్టే…’ అలేఖ్య తారకరత్న ఎమోషనల్

‘అందరూ ఉన్నా ఎవరూ లేనట్టే…’ అలేఖ్య తారకరత్న ఎమోషనల్


‘అందరూ ఉన్నా ఎవరూ లేనట్టే…’ అలేఖ్య తారకరత్న ఎమోషనల్

నందమూరి తారకరత్న మరణానంతరం ఆయన భార్య అలేఖ్య ఓ ఇంటర్వ్యూకు హాజరై తన అనుభవాలను పంచుకున్నారు. 2023 ఫిబ్రవరిలో గుండెపోటుతో తారకరత్న కన్నుమూసిన తర్వాత అలేఖ్య తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. ఈ విషాదం నుంచి బయటపడటానికి ఆమెకు చాలా సమయం పట్టింది. సోషల్ మీడియాలో నిత్యం తారకరత్నను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్టులు షేర్ చేసే అలేఖ్య, తన పిల్లల పెంపకంతో బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో, తారకరత్నతో తన పరిచయం, ప్రేమ, వివాహం వంటి విషయాలపై ఆమె ఓపెన్‌గా మాట్లాడారు. భర్త మరణానంతరం తాను, తన పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తలుచుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తారకరత్న కుటుంబ సభ్యులతో తన సంబంధాల గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం ఎవరితోనూ కాంటాక్ట్‌లో లేనని వెల్లడించారు. ఒకప్పుడు కళ్యాణ్ అన్న మంచి స్నేహితుడిగా ఉండేవారని, ఇప్పుడు బాల బాబాయి మాత్రమే తమకు అండగా ఉన్నారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

స్పిరిట్‌ కథలో అవే హైలైట్స్ !

గ్లోబల్‌ రేంజ్‌లో వారణాసి బ్రాండింగ్‌

ఉస్తాద్‌ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *