అందంలో అప్సరస.. కానీ ఆమె చేసిన పనికి అందరూ అవాక్.. అలా ఎలా పట్టేశావ్ అమ్మడూ..

అందంలో అప్సరస.. కానీ ఆమె చేసిన పనికి అందరూ అవాక్.. అలా ఎలా పట్టేశావ్ అమ్మడూ..


అమ్మాయిల అందం వారి దుస్తులు, వారు చేసే డ్యాన్స్‌లు, పాటల వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కానీ కొంతమంది అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో అంతే వాయిలెంట్‌గా కూడా ఉంటారు..వారు చేసే ప్రమాదకర స్టంట్లు చూసేవారికి వెన్నులో వణుకుపుట్టిచేవిగా ఉంటాయి. అలాంటి ఒక అమ్మాయి వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక యువతి అందమైన చీరకట్టుతో అందంగా కనిపిస్తుంది. కానీ, ఆమె డ్యాన్స్‌ చేయటం లేదు.. అలాగని లయబద్ధమైన పాట కూడా పాడటం లేదు.. బదులుగా పామును పట్టుకోవడానికి వచ్చింది. ఆమె ధైర్యసాహసాలను చూసి ప్రతి ఒక్కరూ షాక్‌ అవుతున్నారు. షాకింగ్‌ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సాహిబా (@saiba__19) వయసు 21 సంవత్సరాలు. ఆమె ముంబైలో నివసిస్తున్నారు. ఆమె వైరల్‌ వీడియో ఒకటి సోషల్ మీడియాలో అందరినీ దృష్టిని ఆకర్షించింది. ఆమె లుక్ చాలా అద్భుతంగా ఉంది. లైట్‌ పింక్‌ కలర్‌ చీరలో మెరిసిపోతుంది. ఆమెను చూస్తుంటే ఎవరో మోడల్ అనుకుంటారు. ఇప్పుడు డ్యాన్స్‌ చేస్తుందేమో, లేదంటే ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌ కావొచ్చు అని పొరపాటు పడుతుంటారు. కానీ, అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే..ఆమె పాములు పట్టడంలో నేర్పరి. అంటే పాములను రక్షించి వాటిని సురక్షితంగా వాటి నివాస స్థలంలోకి తిరిగి వదలేస్తుంది. ఇటీవల, ఆమె పాములను పట్టుకోవడానికి వెళ్లిన సందర్బంలో గిడ్డంగి లాంటి వాతావరణంలో ఉన్న ఒక వీడియోను పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

సాహిబా గిడ్డంగికి చేరుకున్న వెంటనే రంగంలోకి దిగిపోయింది. ముందుగా తన జుట్టును ముడివేసుకుంది. ఆ పాము ఎక్కడ ఉందని స్థానికుల్ని అడిగింది. క్షణాల్లోనే అక్కడ ఆమె తన చేతులతో ఒక పొడవైన పామును పట్టుకుని, ఆపై ఒక కుండలో ఇరుక్కుపోయిన మరొక పామును బయటకు తీసింది. ఆ తర్వాత ఆమె రెండు పాములను సేకరించి ప్లాస్టిక్ కంటైనర్, సంచిలో వేసింది. రెండూ ఎలుక పాములు. ఇవి విషపూరితమైనవి కాదని ఆమె క్యాప్షన్‌లో వివరించింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఆమె వీడియోకు కోటి కంటే ఎక్కువ మంది వ్యూస్ వచ్చాయి. చాలా మంది కామెంట్లు చేసి తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఒకరు దీనిపై స్పందిస్తూ…ఎవరూ కాపీ చేయలేని విధంగా కంటెంట్‌ను సృష్టించండి అని అన్నారు. మరొకరు ఆమె కోరికలు తీర్చే సర్పమో, లేదంటే విషపూరితమైన అమ్మాయియో అని అన్నారు. మరొకరు ఆమెను చీరలో చూసి పాము కూడా కరిగిపోతుందని, అది పాము అని మర్చిపోతుందని అన్నారు. మరొకరు స్పందిస్తూ..పామును పట్టుకోవడానికి కూడా మీరు అంతలా రెడీ అవ్వాలా అని అడిగారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *