Headlines

Gas Cylinder Booking: గ్యాస్ బుక్ చేసుకున్నా డెలివరీ అవ్వలేదా..? ఈ నెంబర్లకు కాల్ చేస్తే మీ పని పూర్తి.. సేవ్ చేసి పెట్టుకోండి..

Gas Cylinder Booking: గ్యాస్ బుక్ చేసుకున్నా డెలివరీ అవ్వలేదా..? ఈ నెంబర్లకు కాల్ చేస్తే మీ పని పూర్తి.. సేవ్ చేసి పెట్టుకోండి..


Gas Cylinder Booking: గ్యాస్ బుక్ చేసుకున్నా డెలివరీ అవ్వలేదా..? ఈ నెంబర్లకు కాల్ చేస్తే మీ పని పూర్తి.. సేవ్ చేసి పెట్టుకోండి..

దేశంలో గ్యాస్ కొరత క్రమంలో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. సంక్షోభం మరింత ముదిరే అవకాశం ఉన్న క్రమంలో ముందుగానే గ్యాస్ బుక్ చేసుకుని నిల్వ చేసి పెట్టుకుంటున్నారు. రెండు సిలిండర్లు ఉన్నవారు రీఫిల్లింగ్ కోసం బుకింగ్ చేసుకుంటున్నారు. ఇక ఒక గ్యాస్ మాత్రమే వాడేవారు మరో గ్యాస్ సిలిండర్ కొత్తగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దేశంలో గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ ఒక్కసారిగా పెరిగిపోగా.. ఆయిల్ కంపెనీల సర్వర్లు కూడా డౌన్ అవుతున్నాయి. ఈ క్రమంలో అదనపు సిలిండర్లను బుక్ చేసుకోవడానికి తొందరపడవద్దని, ప్రజలు భయపడవద్దని కేంద్రం సూచిస్తోంది. గృహ వినియోగదారులకు సరఫరా చేసేందుకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేసింది. అయితే రానున్న రోజుల్లో గ్యాస్ దొరకదనే ఆందోళన ప్రజల్లో నెలకొంది.

గ్యాస్ అందకపోతే ఫిర్యాదు చేయొచ్చు

డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులు భయాందోళన పడాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. బుక్ చేసుకున్న రెండున్నర రోజుల్లోనే డెలివరీ చేసేందుకు స్పష్టం చేసింది. అయితే డెలివరీ అవ్వకపోతే ఫిర్యాదు చేసేందుకు ఆయిల్ కంపెనీలు హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చాయి. ఇండేన్ గ్యాస్ వాడే కస్టమర్లు 1800-2333-555 (టోల్ ఫ్రీ), 7718955555 నెబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఇక భారత్ గ్యాస్ వినియోగదారులు 1800-22-4344 (టోల్ ఫ్రీ), 7715012345 నెంబర్లకు కాల్ చేయాలని సూచించింది. హెచ్‌పీ గ్యాస్ వాడేవారు1800-2333-555 (టోల్ ఫ్రీ), 9493602222 నెంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించింది. 24 గంటల పాటు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. కస్టమర్లు ఫిర్యాదు చేస్తే సిబ్బంది స్పందించి గ్యాస్ త్వరగా డెలివరీ అయ్యేల చర్యలు తీసుకుంటారని స్పష్టం చేసింది.

అదనపు డబ్బు డిమాండ్ చేస్తే..

ఇక గ్యాస్ కోసం అదనపు డబ్బుులు డిమాండ్ చేస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. గ్యాస్ కొరత వల్ల డెలివరీ చేయడానికి కొంతమంది గ్యాస్ డీలర్లు అదనపు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా అదనంగా డబ్బులు వసూలు చేయడం చట్టవిరుద్దమని, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించాలని కంపెనీలు కోరుతున్నాయి. ఇక బ్లాక్ మార్కెట్ లేదా అక్రమ మార్గంలో గ్యాస్ డెలివరీ చేసే డీలర్లపై చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. డీలర్లు ఏమైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వినియోగదారులు హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించింది.  అటు కొంతమంది అక్రమార్కులు రూ.960గా ఉన్న గ్యాస్ సిలిండర్‌ను రూ.1500కి విక్రయిస్తున్నారు. ఇలాంటివారిపై అధికారులు దృష్టి పెట్టి సిలిండర్లను సీజ్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో పలువురి వద్ద అక్రమ సిలిండర్లను సీజ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *