
వైరల్ వీడియోలో ఆ అమ్మాయి సోఫాలో కూర్చుని తన మొబైల్ ఫోన్ చూస్తోంది. ఆ సమయంలో ఫోన్ ఛార్జర్‌కు కనెక్ట్ అయి ఉన్నట్లు కనిపిస్తోంది. కొన్ని సెకన్ల పాటు అంతా సాధారణంగానే ఉన్నట్లు అనిపించింది. కానీ అకస్మాత్తుగా పరిస్థితి మారిపోయింది. సడెన్‌గా ఫోన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. ఫోన్ పేలడంతో ఆ అమ్మాయి భయపడిపోయింది. బ్యాలెన్స్ కోల్పోయి, సోఫా మీద నుంచి పడిపోయింది. ఆ క్షణం భయంకరంగా ఉంది. ఎందుకంటే ఫోన్ ఆమె ముఖానికి చాలా దగ్గరగా ఉంది. అదృష్టవశాత్తూ ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు. పేలుడు తర్వాత, ఫోన్ నుండి చిన్న మంటలు, నిప్పురవ్వలు కనిపించాయి. దీని వలన గది అంతా తేలికపాటి పొగ వ్యాపించింది.
ఉన్నట్టుండి చేతిలో ఫోన్ పేలడంతో ఆ అమ్మాయి భయంతో వణికిపోయింది. ఆమెకు ఏమి చేయాలో తెలియలేదు. భయపడి ఆమె ఫోన్‌ను కింద పడేసి, ఏడుస్తూ అక్కడి నుండి పారిపోయింది. పగిలిపోయిన మొబైల్ ఫోన్ నేలపై పడి ఉంది. మంటలు, మండుతున్న శబ్దాలతో అక్కడి దృశ్యం భయానకంగా కనిపించింది.
ఈ వీడియో ఆన్‌లైన్‌లో కనిపించిన వెంటనే, ప్రజలు మొబైల్ ఫోన్ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది వినియోగదారులు పిల్లలకు ఫోన్లు ఇవ్వడం, ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించడం చాలా ప్రమాదకరమని అంటున్నారు.. చాలా మంది రాత్రిపూట ఫోన్‌లను ఛార్జింగ్‌లో ఉంచుకుని నిద్రపోతారని, అది కూడా ప్రమాదం అంటూ కొందరు వ్యాఖ్యనించారు. ఇలాంటి సంఘటనలు ఇది ఎంత ప్రమాదకరమో తెలియజేస్తున్నాయని చెప్పారు.
వీడియో ఇక్కడ చూడండి..
While a girl was using her phone, it suddenly exploded. This is a reminder that we should all stay careful. pic.twitter.com/4CEd123C95
— Hindustan Ki Army (Fan)
(@HindustanKiArmy) March 11, 2026
వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ సంఘటన నిజమని చాలామంది నమ్ముతుండగా, మరికొందరు ఈ వీడియోను AI సృష్టించి ఉండవచ్చని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది నిపుణులు కూడా, ఈ వీడియో నిజమైన CCTV ఫుటేజ్‌గా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఇది ఛార్జింగ్ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా స్పార్క్ ఏర్పడి, చిన్న మంటలు చెలరేడినట్టుగా చూపిస్తుందని చెప్పారు. ఇటువంటి ప్రమాదాలు తప్పు ఛార్జర్, తప్పు బ్యాటరీ లేదా ఫోన్ వేడెక్కడం వల్ల సంభవిస్తాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఛార్జింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం అంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
While a girl was using her phone, it suddenly exploded. This is a reminder that we should all stay careful.
(@HindustanKiArmy)