Headlines

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!


వేసవిలో మట్టి కుండ నీరు కూల్‌ కూల్‌గా..!

చాలా మందికి బాగా చల్లటి పదార్థాలు తిన్నా, ఫ్రిజ్‌లో నిల్వ చేసిన నీళ్లు తాగినా జలుబు చేస్తుంది. అదే మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని తాగితే వారికి జలుబు రాదు. వేసవిలో మన దాహాన్ని తీర్చి ఇంకా బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది మట్టి కుండ. అందుకే చాలామంది తమ ఇళ్లలో ఫ్రిడ్జ్‌ ఉన్నప్పటికీ ఓ మట్టి కుండను తప్పకుండా ఏర్పాటు చేసుకుంటారు. ఫ్రిజ్‌ వాటర్‌కి బదులుగా ఆ నీటిని తాగుతూ మండే వేసవిలో చల్లటి నీళ్లు తాగాలన్న తమ కోరికను తీర్చుకుంటారు. వేసవిలో బాగా చల్లగా ఉండే నీరు తాగాలనిపిస్తుంది. అయితే అంత చల్లదనాన్ని మన సున్నితమైన గొంతు తట్టుకోలేదు. ఫలితంగా గొంతునొప్పి, జలుబు, దగ్గు వస్తుంటాయి. మట్టి కుండలో నీటిని తాగడం మంచిది. మట్టి సహజసిద్ధ కూలింగ్‌ ఏజెంట్‌గా పనిచేసి.. మన గొంతు ఎంత చల్లదనాన్నైతే తట్టుకుంటుందో అంతే చల్లటి నీటిని మనకు అందిస్తుంది.మట్టి ఎన్నో ఖనిజ లవణాల మిశ్రమం. అందులో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్‌ ఎనర్జీ దాగుంటుంది. ఈ సద్గుణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. ఆ నీటిని తాగడం వల్ల వేసవిలో మనం కోల్పోయిన శక్తిని తిరిగి పొందడంతో పాటు శరీరం డీహైడ్రేట్‌ కాకుండా జాగ్రత్తపడచ్చు. వేసవిలో వడదెబ్బ తగలడం సహజం. అలా జరగకూడదంటే మట్టి పాత్రల్లో నిల్వ చేసిన నీరు తాగడం మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ నీళ్లు శరీరంలోని గ్లూకోజ్‌ స్థాయుల్ని అదుపులో ఉంచి వడదెబ్బ నుంచి మనల్ని కాపాడతాయి.

మరిన్ని వీడియోల కోసం :

ప్రకృతి ఒడిలో అరుదైన దృశ్యం..జంటపాముల సయ్యాట!

భాగ్యనగరంలో హోటళ్లకు కట్టెల పొయ్యిలే దిక్కా!

ప్రపంచానికి ‘చమురు’గండం.. ఆగ్నేయాసియాలో ఎనర్జీ ఎమర్జెన్సీ!

మరణం సైతం విడదీయలేని మహా బంధం!

మళ్లీ పెళ్లికి రెడీ అయిన మాజీమంత్రి మల్లారెడ్డి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *